అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

ఐసీఐసీఐ లాంబార్డ్ ,అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ ,మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో ఒప్పందం

ముంబై, ఏప్రిల్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు గాను ఒక విశిష్ట సీఎస్ఆర్ కార్యక్రమానికి నాంది పలికింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో తనకు గల అనుభవం మరియు సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అది, దేశ అణగారిన వర్గాల్లో  కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరి కట్టేందుకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన అపోలో హె ల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్ తో మరియు మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో  భాగస్వామి గా మారింది. ఈ కార్యక్రమంలో భా గంగా కోవిడ్ -19 అనుమానిత కేసులను పరీక్షించేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్స్ తో యావత్ స్క్రీనింగ్ ప్రొసీ జర్ కు నిధులను సమకూర్చనుంది.  ఈ కార్యక్రమం కోసం సంస్థ రూ.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సమాజం లోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చనుంది. టెస్టింగ్ కిట్, ఇంటి నుంచి శాంపిల్ సేకరణ, డయాగ్నసిస్ మరియు టెస్ట్ రిజల్ట్ జనరేట్ చేయడం లాంటివి కలిపి కోవిడ్ -19 టెస్ట్ వ్యయం ప్రస్తుతం రూ.4,500 గా ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పేద వర్గాలకు చెందిన 11,000 మంది ప్రయోజనం పొందారు. వీరంతా కూడా వైరస్ లక్షణాలు కలిగి ప్రాధాన్యపూర్వకంగా టెస్ట్ లు చే యించుకోవాల్సిన అవసరం ఉన్నవారే. అంతేగాకుండా టెస్టింగ్ కిట్స్ యొక్క ధరలు తగ్గితే సమాజంలో మరెం తో మందికి ఈ కార్యక్రమం మేలు చేయనుంది. అంత్యోదయ రేషన్ కార్డు మరియు బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ కార్యక్రమం కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు.ఈ సందర్భంగా ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ భార్గవ్ దాస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సవాళ్ళ సమయంలో సమాజంలోని పేదలు కోవిడ్-19కు లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *