5న రాత్రి 9 గంటలకు దీపం వెలిగించండి

న్యూ డిల్లీ : కరోనా పై యుద్ధానికి భారత ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాలు పాటు లైట్లు ఆపేయాలని ఆయన కోరారు.ఆ సమయంలో మొబైల్ ఫ్లాష్ లైట్ లేదా కొవ్వొత్తి దీపం వెలిగించాలని ఆయన తెలిపారు. దేశ ప్రజల సంకల్ప శక్తిని వెలిగించండి. అయితే ఈ కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించండి అని ప్రధాని కోరారు. భారత ప్రజలని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ నేడు ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *